ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Monday, April 25, 2011

పూతరేకులు.9






చిన్నది చాలు
ఇంటికోసం వేటాడి విసిగిపోయిన దేశరాజు సిటీ అంతా బాగా తెలిసిన ఆశారాజు కనిపిస్తే అలవాటుకొద్దీ ‘‘ఏదైనా అద్దెకిచ్చే ఇళ్లున్నాయా?’’ అని అడిగాడు.
ఆశారాజు తాపీగా చూశాడు. మొదట వినిపించుకోనట్లుగా వున్నాడు. తీరుబడిగా పైకి ఒకసారి, చుట్టూ ఒకసారి చూసి ‘‘ఇల్లా? అమాయకుడిలా వున్నావు... అందులో ఇక్కడా? నీలాకాశపు పైకప్పులో, నక్షత్రాల దుప్పటి క్రింద, ప్రకృతి మాత ఒడిలో హాయిగా కాపురం చేయకూడదూ!’’ అన్నాడు.
‘‘అంత పెద్దదక్కరలేదండి. ఇంకా కాస్త చిన్నదేమైనా దొరుకుతుందేమోనని అడిగానంతే’’ అని అన్నాడు దేశరాజు.
***
ఏకాభిప్రాయం
ఇద్దరి మధ్యా ఏకాభిప్రాయం కుదరడం లేదని హైమవతి కళాకృష్ణను వివాహం చేసుకోవడానికి ఏం చెప్పినా వద్దంటోంది. అతగాడు పట్టువదల్లేదు.‘‘చూడండి! ఒక చిన్న కథ. రెండు పడకలున్న గదిలోకి వెళ్లారనుకోండి. ఒక మంచం మీద ఒక యువకుడు, మరో మంచం మీద ఒక యువతి నిద్రపోతున్నారు. మరి మీరు ఏ మంచంలో పడుకుంటారు. చెప్పకపోతే ఒట్టు’’ అన్నాడు కళాకృష్ణ.
‘‘అమ్మాయి పడుకున్న మంచంలో’’ అంది కోపంగా చూస్తూ హైమ.
‘‘చూశారా! నేనూ అంతే! ఇప్పటికి మనకి అభిప్రాయాలు కలిసి ఏకాభిప్రాయం కుదిరింది’’ అని చిరునవ్వు నవ్వాడు కళాకృష్ణ.
***


సహాయం
‘‘ఆవిడ అద్దె ఇవ్వలేక బాధపడుతోంది. గంపెడు సంసారం. ఇలాంటి పరిస్థితిలో సహాయం చేయడం మన ధర్మం. ఏదైనా సహాయం చేయండి పాపం ఆవిడకి’’ అంటూ ఒకాయన వచ్చాడు ఓ పెద్దమనిషివద్దకు.
‘‘ఎవరావిడ? ఎక్కడ అద్దెకుంటోంది’
‘‘ఎక్కడో కాదండీ మా ఇంట్లోనే అద్దెకుంటోంది’’ అన్నాడు సహాయంకోసం వచ్చిన వ్యక్తి.


***


పోటీ
ఒక ఊళ్లో ఎదురెదురుగా రెండు దుకాణాలున్నాయి. ఇద్దరు పోటీలుగా అమ్ముతున్నారు వస్తువులు.
ఒక దుకాణంవాడు ‘‘50 రూపాయలకే గడియారం! త్వరపడండి’’ అని బోర్డు కట్టాడు
రెండవ కొట్టువాడు ఆలోచించి ‘‘ఇక్కడ 50 రూపాయల గడియారాలు బాగుచేయబడును’’ అని బోర్డు కట్టాడు.


***


అభిమానం
‘‘మీరు గత ఎన్నికల్లో డిపాజిట్ దక్కకుండా ఓడిపోయినా ప్రజలు మీవద్దకు ఇంతగా తరలివచ్చి అభిమానిస్తున్నారంటే...’’అంటూ శ్రీనివాస్ ఇంటి ముందు జనాన్ని చూసి అబ్బురపడ్డాడు సాటి మిత్రుడు. వెంకట్రామయ్య.‘‘అబ్బే...వాళ్లు అప్పులోళ్ళు! బాకీ వసూళ్ళకోసం వచ్చారు’’ అన్నాడు శ్రీనివాసు.
***


బ్రా‘సరి'
సిఖ్‌విలేజ్‌లో ఓ బ్రాసరీల వ్యాపారస్తుడు మూడు రకాల బ్రాసరీల్ని అడ్వర్‌టైజ్ చేయడం ప్రారంభించాడు.
వాటి పేర్లు డిక్టేటర్ బ్రాసరీలు, వెల్‌ఫేర్ బ్రాసరీలు, పొలిటీషియన్ బ్రాసరీలు.
విజయప్రభ ఆ దుకాణానికి వచ్చి ఈ కొత్త తరహా వాటి వివరాలు అడిగింది.
‘‘డిక్టేటరండి, అంటే నియంత. తన క్రింద ఉన్న వాళ్లందర్నీ అణచి పారేస్తూంటాడు. వెల్‌ఫేర్ అంటే తెలుసుగా- పడిపోయిన వాళ్లని ఉద్ధరించడం; ఇక పొలిటీషియన్లంటారూ- ఆవగింజంత విషయాన్నయినా మామిడి పండంత చక్కగా చిత్రిస్తారు’’ అని వ్యాపారస్తుడు చెప్పి ‘‘మీకేతరహా నచ్చితే అవే తీసుకోండి’’ అన్నాడు.
విజయప్రభ కాస్సేపు తటపటాయించి ‘‘ఏమిటోలెండి. ఇవన్నీ పొలిటీషియన్ల రోజులుగా ఉన్నాయి’’ అంటూ తనకు కావలసిన తరహాను సూచించింది.
***
కవి ముఖం
గిరిజాలభావకవి దేవులపల్లి కృష్ణశాస్ర్తీగారిని పూర్వం గుండున్న పండితులు వెక్కిరింపుగా
‘‘కృష్ణశాస్ర్తీగారూ! మీరు ‘బావ’కవులా’’అని అడిగారు.
దానికి కృష్ణశాస్ర్తీగారి జవాబు: ‘‘మీరంతా ‘అప్ప' కవులు కదా మరి!’’


***
స్ట్రైక్
కార్మికనాయకుడు ఫ్యాక్టరీ యజమాని గదిలోకి దూసుకువచ్చాడు.
‘‘మీ ఉద్దేశ్యం ఏమిటండీ! స్ట్రైక్ నోటీస్ ఇవ్వగానే మేం అడిగిన కోర్కెలన్నంటికీ ఒప్పేసుకుంటా ఎలా? ఇలాగయితే మేం స్ట్రైక్ ఎలా చేస్తామనుకున్నారు.’’
***


గుండె చప్పుడు
కరువైతేఏమవుతుందో
తెలియదు కానీ
నీ గొంతు చప్పుడు వినకపోతే
కొట్టుకోనంటుంది నా గుండె.

0 comments: